ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్థలం కోసం తల్లి,కొడుకులకే గొడవపెట్టిన నాయకులూ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 19, 2023, 04:15 PM

విజయవాడ పరిధిలోని గొల్లపూడి వన్ సెంటర్‌లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. వన్ సెంటర్‌లోని టీడీపీ కార్యాలయంలో కటౌట్లు, పార్టీకి సంబంధించిన సామాగ్రిని అధికారులు తొలగించారు. మరోవైపు దేవినేని ఉమ  నివాసం వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థల యజమానుల మధ్య తలెత్తిన వివాదాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది వైసీపీ నాయకులు  ఈ తతంగానికి పాల్పడ్డారని టీడీపీ నేతలు, స్థల యజమానులు ఆరోపించారు. ఈ సందర్బంగా స్థల హక్కుదారుడు ఆలూరి హరి కృష్ణ, అలియాస్ చిన్నా మాట్లాడుతూ...  ఈ స్థలం తనకు 2009లో రిజిస్ట్రేషన్ జరిగిందని.. తర్వాత టీడీపీ కార్యాలయం కోసం లీజుకు ఇచ్చానన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత ఎమ్మెల్సీ తలసిల రఘురామ్ ఈ స్థలం ఆపీసు కోసం కావాలంటూ తనకు.. తన తల్లి మధ్య గొడవలు పెట్టి... ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com