రహదారి భద్రత నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ సూచించారు. ఒంగోలు స్థానిక ప్రకాశం భవన్‌లోని స్పందన హల్‌లో జాతీయ రహదారి భద్రత వారోత్సవాల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... రహదారి భద్రత కోసం అధికారులు కృషి చేయాలని, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం రవాణా శాఖ కార్యాలయంలో డ్రైవర్లకు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మార్కాపురం ఆర్టీవో అమర్‌నాయక్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. బ్రేక్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ ప్రభాకర్ మాట్లాడుతూ బుధవారం నుంచి ఈనెల 24 వరకు రహదారి భద్రత వారోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో 200 మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు చేశారు. కార్యక్రమంలో బ్రేక్ ఇన్‌స్పెక్టర్లు రామచంద్రరావు, సురేంద్ర ప్రసాద్, ఏవోలు శ్రీనివాసరావు, సుధాకర్, డాక్టర్లు ప్రభాకర్‌శాస్త్రి, శ్రీదేవి ప్రియ, హరీష్ పాల్గొన్నారు.