జగన్‌రెడ్డి పాలనలో అన్ని రంగాలు అస్తవ్యస్తమయ్యా యని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా, బేస్తవారపేట మండలంలోని సోమవారపేటలో బుధవారం ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈసందర్భంగా అశోక్‌రెడ్డి నాయకులతో ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. రాష్ట్రం బాగుపడాలన్నా, ప్రజల కష్టాలు తీరాలన్నా తిరిగి చంద్ర బాబు ముఖ్యమంత్రిగా గెలవాలన్నారు. వైసీపీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక పడు తున్న ఇబ్బందులు, ధరల పెరుగుదలను ప్రజల నుంచి తెలుసుకున్నారు. బీసీ కార్పొ రేషన్ పేరుతో నిలువునా మోసగించార న్నారు. సోమవారపేటలో చేనేత కార్మికు లున్నా వారికి ఎలాంటి రుణాలు, సబ్సి డీలు కల్పించ లేదన్నారు. దీంతో వారు వలస వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వైసీపీ పాల కులకు వచ్చే ఎన్నికల్లో ఓటుతో తరిమి కొట్టాలని అశోక్‌రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండ లాధ్యక్షుడు సోరెడ్డి మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుంటల నరసింహ,పూనూరు భూపాల్‌రెడ్డి, గాజుల విశ్వనాథం, అరుణ్‌కుమార్, రాము, రోషన్‌బాబు, సైదులు,బాషా, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.