ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘం నేతలు ఇవాళ ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఇతర కార్యవర్గ సభ్యులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. ముఖ్యమంత్రి జగన్తో పలు అంశాలపై చర్చించారు.