ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇవాళ రాష్ట్రంలోని ఉన్నత విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. డిగ్రీ విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. వివిధ కోర్సులను పాఠ్యాంశాల్లో చేర్చాలని సూచించారు. జిల్లాల్లోని పరిశ్రమల వారీగా కోర్సులు నిర్వహించాలన్నారు. కోడింగ్, క్లౌడ్ సర్వీసెస్ వంటి డిమాండ్ ఉన్న కోర్సులపై దృష్టి సారించాలని పేర్కొంది. విదేశాల్లోని కోర్సులను పరిశీలించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.