నంద్యాలలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ కార్యదర్శి మేయప్పన్, తెలంగాణ మాజీ పీసీసీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ఉద్యోగులు జీతాల విషయం పై గవర్నర్‌ను కలవడం సిగ్గుచేటన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా ఎపిలో అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తామన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభావం అంతగా ఉండదన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మంలో బీఆర్ఎస్ మీటింగ్‌కు ప్రజలు స్వచ్చందంగా రాలేదన్నారు. బీఆర్ఎస్ అధినేత పెద్ద కోరికలతో ముందుకెళ్తున్నారన్నారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారడం వల్ల వాళ్ళకే నష్టమని ఉత్తమ్ పేర్కొన్నారు.