గవర్నర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు కర్నూల్ జిల్లా కలెక్టరు మనజీర్ జిలానీ సామూన్ తెలిపారు. ఏర్పాట్లను కలెక్టరుతో పాటు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎస్పీ రఘువీర్‌రెడ్డి ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు పర్యవేక్షించారు. అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ...... చెంచుల జీవన సంస్కృతిని తెలిపే స్టాళ్లను, ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను గవర్నర్ పరిశీలిస్తారని అన్నారు. పాణ్యం ఇందిరానగర్‌లోని 300 కుటుంబాలతో పాటు జిల్లాలోని ఇతర చెంచుగూడేలకు చెందిన చెంచులు గవర్నర్‌తో ముఖాముఖి చర్చించనున్నట్లు తెలిపారు. అనంతరం గవర్నర్ పర్యటన కాన్వాయ్ ట్రయ ల్ను ఎస్సీ, కలెక్టరు పరిశీలించారు. డీఎస్పీ మహేశ్వరరెడ్డి, డీఆర్వో పుల్లయ్య, తహసీల్దారు మల్లికార్జునరెడ్డి, ఎంపీడీవో దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు.