నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. సంతాపేట మాగాణి వారి వీధిలోని తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ కప్పిర శ్రీనివాసులు ఇంటి ఎదుట చెత్త తొలగించకుండా తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. ఆ ప్రాంతంలో తీవ్ర దుర్గంధంతో స్థానిక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. దీంతో రెండు రోజుల్లో చెత్తచెదారాలు తొలగించకుంటే, చెత్తను మున్సిపల్ కార్యాలయం ఎదుట పోసి ఆందోళన చేస్తామని మాజీ కార్పొరేటర్ కప్పిర శ్రీనివాసులు హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa