ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ మూత్ర విసర్జన చేస్తే అది తిరిగి పడుతుంది...లండన్ లో ప్రయోగం

international |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 11:39 PM

లండన్ దేశం తాజాాగా ఓ కొత్త ప్రయోగాన్ని చేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ బహిరంగ మూత్ర విసర్జన అనేది ఒక సమస్యలా మారింది. పలు నగరాల్లో బహిరంగ మూత్ర విసర్జన వద్దంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ఫలితం ఉండడంలేదు. ఈ నేపథ్యంలో, లండన్ మహానగరంలో అధికారులు వినూత్న కార్యాచరణ చేపడుతున్నారు. 


సెంట్రల్ లండన్ లోని సోహో టౌన్ షిప్ లో దాదాపు 12 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు... అక్కడి గోడలపై ఒక ప్రత్యేకమైన ద్రవాన్ని పూయాలని నిర్ణయించారు. ఈ ద్రవం పూసిన గోడలపై మూత్రవిసర్జన చేస్తే, అది తిరిగి మూత్రం పోసిన వారిపైనే చింది పడుతుంది. తద్వారా బహిరంగ మూత్ర విసర్జనకు బ్రేక్ పడుతుందన్నది అధికారుల ఆలోచన. ఈ ద్రవం పూసిన గోడల వద్ద ప్రత్యేకంగా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయనున్నారు. 


ఇదిలావుంటే ఈ ద్రవం ఒక పెయింట్ వంటి పదార్థమని, చాలా ప్రభావవంతమైన పనితీరు కనబరుస్తోందని స్థానిక కౌన్సిలర్ ఒకరు వెల్లడించారు. అంతేకాదు, ఆయన ఆ ద్రవం పనితీరును అందరికీ ప్రదర్శించి చూపించారు. ద్రవం పూసిన గోడపై కొన్ని నీళ్లు పోయగా, ఆ నీళ్లు వెంటనే వెనక్కి చిమ్మాయి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa