బ్రిజ్‌భూషణ్ సింగ్‌ను భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) అధ్యక్షుడి పదవి నుంచి తాత్కాలికంగా తప్పిస్తున్నట్లు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. పర్యవేక్షణ కమిటీ విచారణ పూర్తయ్యే వరకు బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. కాగా బ్రిజ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన రెజర్లు ఆందోళనకు దిగగా, దీనిపై విచారణకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్.