దేశ పార్లమెంటును బీజేపీ ప్రభుత్వం 'నోటీసు బోర్డుగా, రబ్బరు స్టాంప్‌గా' మార్చేసిందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ విమర్శించారు. ఎలాంటి ఎమర్జెన్సీని ప్రకటించకుండానే ఈ ప్రభుత్వం అనేక నిరంకుశ నిర్ణయాలు తీసుకుందని అన్నారు. దీన్ని దీన్ని అప్రకటిత ఎమర్జెన్సీగా పరిగణించవచ్చని పేర్కొన్నారు. రాజస్థాన్‌లో జైపుర్‌లో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొన్న శశిథరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు.