గవర్నర్ హరిచందన్ గిరిజనులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం ముగిసింది. గవర్నర్ ప్రసంగం 23 నిమిషాల పాటు సాగింది. అది కూడా ఆయన ఇంగ్లీషులో మాట్లాడితే తెలుగులో అనువదించడానికి పట్టిన సమయం. ఈ లెక్కన గవర్నర్ మాట్లాడింది 10 నుంచి 12నిమిషాలే. కానీ డిప్యూటీ సీఎం, జిల్లా ఇన్‌చార్జి, మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర ఇద్దరూ అరగంటకు పైగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నవరత్నాలతోనే గిరిజనులకు పింఛన్లు, విద్య వంటివి అందుతున్నాయని అన్నారు. ఇక ముఖాముఖిలో ఆ పార్టీకి చెందిన వారినే ఎంపిక చేసి మాట్లాడించారు. ప్రొటోకాల్ ప్రకారం బలపనూరు సర్పంచ్‌ను వేదిక మీదకు పిలవకపోవడం గమనార్హం. కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్‌దండే పాల్గొన్నారు.