ఆంధ్రప్రదేశ్ లోని బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ల పదవీ కాలాన్ని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా 55 మంది ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పదవుల్లో కొనసాగాలని ప్రభుత్వం ఆదేశించింది. గత డిసెంబర్ 17తో వారి పదవీకాలం ముగియగా, తాజాగా పదవీకాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.