ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శిక్షణ ఖర్చును ఉద్యోగుల నుంచి రాబెట్టే ప్రయత్నం చేస్తున్న విప్రో

national |  Suryaa Desk  | Published : Sun, Jan 22, 2023, 11:24 AM

విప్రో సంస్థ తాజాగా జారీ చేసిన ఓ నోటీసు చర్చాంశ నియంగా మారింది. ఇదిలావుంటే ఖర్చులు తగ్గించుకునే పేరుతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్న జాబితాలోకి టెక్ దిగ్గజం ‘విప్రో’ కూడా చేరింది. అయితే, మిగతా కంపెనీలతో పోలిస్తే విప్రో ఒకడుగు ముందుకేసి ఉద్యోగుల నుంచి సొమ్ము కూడా వసూలు చేసుకునే ప్రయత్నం చేసింది. ఉద్యోగంలోకి తీసుకున్నాక శిక్షణ కోసం వారిపై వెచ్చించిన సొమ్మును తిరిగి రాబట్టుకునేందుకు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత ఆ సొమ్మును మాఫీ చేస్తున్నట్లు సదరు ఉద్యోగులకు లేఖలు పంపింది.


విప్రోలో ఇటీవల చేరిన 452 మంది ఫ్రెషర్లకు ఆ కంపెనీ షాక్ ఇచ్చింది. కంపెనీ అంతర్గత మదింపులో వారి పనితీరు బాగాలేదని తేలిందని చెబుతూ, వాళ్లను ఉద్యోగంలో నుంచి తీసేసింది. అంతేకాదు, శిక్షణ కోసం వారిపై కంపెనీ రూ.75 వేలు వెచ్చించిందని, ఆ మొత్తాన్ని కంపెనీకి కట్టేయాలని నోటీసులు కూడా పంపింది. ఓవైపు ఉద్యోగం ఊడిందన్న ఆవేదనలో ఉన్న వారికి ఈ నోటీసులు ఆందోళనలోకి నెట్టాయి. అయితే, ఈ మొత్తాన్ని మాఫీ చేస్తున్నట్లు విప్రో తాజాగా లేఖలు పంపడంతో కొంత ఉపశమనం దక్కింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com