టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని నారా లోకేశ్ చెబుతున్నాడని, కానీ గతంలో టీడీపీ పాలనలో ఒక కులం, ఒక కుటుంబం, ఒక జిల్లాలోనే అభివృద్ధి జరిగిందన్న విషయం అందరికీ తెలుసని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 2014-19 మధ్య కాలంలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. నాడు చంద్రబాబు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు వాటి కాగితం విలువ కూడా చేయవని విజయసాయి విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa