లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ ఎం. బాబు, జూనియర్ సివిల్ జడ్జి పీఎస్‌వీబీ కృష్ణ సాయితేజ సూచించారు. కోర్టు సముదాయంలో పోలీస్, రెవిన్యూ, బ్యాంకు అధికారులు, న్యాయవాదులతో శనివారం వేర్వేరుగా నిర్యహించిన సమావేశాల్లో వారు మాట్లాడారు. ఫిబ్రవరి 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కారమయ్యేలా కక్షిదారులను చైతన్యపర్చాలన్నారు. బార్ అసోసీయేషన్ కార్యదర్శి సీహెచ్ శంకరరావు, ఏజీపీ ఎస్ పోలారావు, న్యాయవాదులు, సీఐలు కేరవికమార్, ఉపేంద్రరావు పాల్గొన్నారు.