ఏపీలో రేషన్ కార్డు దారులకు గోధుమపిండి సరఫరా చేయనున్నారు. ఫిబ్రవరి నుంచి ఉత్తరాంధ్రలోని 16 మున్సిపాలిటీల పరిధిలో పైలెట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేయనున్నారు. కిలో రూ.16 చొప్పున కార్డుదారునికి గరిష్టంగా 2 కిలోలు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై కందిపప్పు, పంచదారతో పాటు గోధుమపిండి కూడా ఇవ్వనుంది. విజయనగరం, మన్యం, అనకాపల్లి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో పెలైట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు.