పాకిస్థాన్లోని కరాచీలో జరిగిన పరువు హత్య సంచలనం రేపింది. పిరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఇంటి నుంచి పారిపోయి ఓ వైద్యుడిని ప్రేమవివాహం చేసుకుంది. ఈక్రమంలో వివాహ ధ్రువీకరణ పత్రం కోసం కరాచీ కోర్టుకు వచ్చిన యువతిపై అందరూ చూస్తుండగానే ఆమె తండ్రి కాల్పులు జరిపాడు. దీంతో కోర్టు హాలులోనే యువతి మరణించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.