ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్ధరాత్రి సమయంలో హోంగార్డు, యువతితో అసభ్యకర ప్రవర్తన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 24, 2023, 03:04 PM

అనంతపురం జిల్లా, కదిరి పట్టణానికి చెందిన ఓ యువతితో ఆదివారం అర్ధరాత్రి సమయంలో హోంగార్డు సుబ్బారెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణ సీఐ మధు సోమవారం సర్కిల్‌ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. పట్టణానికి చెందిన ఓ యువతి.. తన తల్లి కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుండడంతో ఆదివారం అర్ధరాత్రి సమయంలో మాత్రలు తెచ్చేందుకు మెడికల్‌ షాపునకు బయల్దేరింది. పట్టణంలోని బాలికల పాఠశాల సమీపానికి రాగానే.. అక్కడ విధుల్లో ఉన్న హోంగార్డు సుబ్బారెడ్డి.. ఆ యువతిని ఆపాడు. ఎక్కడికెళ్తున్నావని ప్రశ్నించాడు. ఈ సమయంలో ఏం పని అంటూ నానా దుర్భాషలాడాడు. స్టేషనకు రావాలని లాగాడు. దీంతో ఆ యువతి తనతల్లికి కడుపునొప్పి ఎక్కువగా ఉందనీ, మాత్రల కోసం వెళ్తున్నాననీ, కావాలంటే తన ఇంటికొచ్చి, విచారించుకోవాలని తెలిపింది. అయినా.. వినకుండా నానా దుర్భాషలాడాడు. దీంతో బాధితురాలు బాధపడకుంటూ ఇంటికెళ్లిపోయింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. సోమవారం బంధువులతో కలిసి పోలీసులకు హోంగార్డు సుబ్బారెడ్డిపై ఫిర్యాదు చేసింది. ఆ మేరకు హోంగార్డు సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పూర్తిస్థాయిలో విచారించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com