రాష్ట్రంలో మోసకారి ప్రభుత్వం రాజ్యమేలుతోందని, వచ్చే ఎన్నికల్లో సాగనంపాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా, అగళి మండలంలోని ఇరిగేపల్లి లో సోమవారం పార్టీ ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక సర్పంచు లక్ష్మమ్మ అధ్యక్షత వహించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వే సి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్య దర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కేక్ కట్చేసి, స్వీట్లు పంచి పెట్టారు. ఆంజనేయస్వామి సన్నిధిలో పూజలు చేయించారు. యువగళం పాదయాత్ర దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షించారు. అనంతరం గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ.... వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడును సీఎంను చేయాలన్నారు. ఈసందర్భంగా పోస్టర్లు ప్రదర్శిస్తూ గ్రామంలో ఇంటింటా వైసీపీ ప్రభుత్వ అక్రమాలను తెలియజేస్తూ టీడీపీని బలపర్చాలని కోరారు.