రాజస్థాన్లోని అమానవీయ ఘటన జరిగింది. రాష్ట్ర మంత్రి మమతా భూపేష్ నిర్వహించిన 'జనతా దర్బార్'కు శనివారం ఓ మహిళ తన 8 ఏళ్ల కుమార్తెతో వచ్చింది. బాధితురాలు తన సమస్య చెబుతుండగా మంత్రి సెక్యూరిటీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మమతాభూపేష్ సమక్షంలోనే ఆమెను బయటకు ఈడ్చుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.