గూగుల్ సంస్థ సుమారు 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై ఆ సంస్థ సీఈవో సుదర్ పిచాయ్ స్పందించారు. కంపెనీ ప్రగతి మందగించిందని, అందుకే సరైన సమయంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. కంపెనీ వ్యవస్థాపకులు, బోర్డు సభ్యులతో చర్చించిన తర్వాత 6 శాతం ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.