తాలిబన్ల పాలనతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరవుతున్న అఫ్గాన్ ప్రజలను చలి వణికిస్తుంది. తీవ్రమైన చలిగాలు, కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగం వల్ల అఫ్ఘనిస్తాన్‌లో 100 మందికి పైగా మరణించారు. గత 2 వారాల్లో వివిధ ప్రావిన్స్‌లలో కనీసం 104 మంది మరణించారని, 50 ఇళ్లు ధ్వంసమయ్యాయని అక్కడి అధికారులు చెప్పారు. అటు దేశంలోనే అత్యంత వేడిగా ఉండే నిమ్రూజ్ ప్రాంతంలోని కమల్ ఖాన్ రిజర్వాయర్‌లో నీరు కూడా గడ్డకట్టింది.