లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ చేయిస్తామని నమ్మించి ఇద్దరు కేటుగాళ్లు ఓ వృద్ధుడి వద్ద రూ.2.7 కోట్లు కాజేశారు. యూపీ నోయిడాకు చెందిన వృద్ధుడికి 2018లో ఓ వ్యక్తి ఫోన్ చేసి పాలసీ ల్యాప్స్ అయ్యిందని, రెన్యువల్ చేసేందుకు డబ్బు చెల్లించాలన్నాడు. దీంతో వేర్వేరు బ్యాంకుల్లో డబ్బు జమ చేశాడు. అనంతరం మోసపోయానని పోలీసులను ఆశ్రయించగా సోమవారం నిందితులను అరెస్ట్ చేశారు.