తిరుపతి జిల్లా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఉన్న శ్రీనివాసా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో గత రెండు రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి 66 వ స్కూల్ గేమ్స్ అండర్ 14 రోల్ బాల్ క్రీడా పోటీల్లో గంగాధర నెల్లూరు మండలం , పాపిరెడ్డి పల్లె పంచాయతీ, పెడకంటపల్లి గ్రామానికి చెందిన విశ్వనాథం మనవడు పీఎం జవహర్ రోల్ బాల్ టోర్నమెంట్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా రోజా చేతుల మీదుగా మంగళవారం పిఎం జవహర్ గోల్డ్ మెడల్ పథకాన్ని అందుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa