సెల్ఫీ మోజులో పాము కాటుకు గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి కందుకూరు పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాళ్లూరు మండలం బొద్దకూరుపాడు గ్రామానికి చెందిన మణికంఠ రెడ్డి కందుకూరు పట్టణం కోవూరు రోడ్డులో జ్యూస్ షాప్ నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఆ ప్రాంతానికి పాములు ఆడించేవారు రాగ ఆ పామును మెడలో వేసుకొని సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో మణికంఠ రెడ్డి పాముకాటుకు గురైయ్యాడు. స్థానికులు వెంటనే అతన్ని ఒంగోలు రిమ్స్ తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa