ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి బుధవారం నాడు పాఠశాలను సందర్శించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం, జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ మరియు జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి డా. అంబవరం ప్రభాకర్ రెడ్డి దువ్వూరు మండలంలోని పుల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1957 సంవత్సరంలో ఇరగమ్ రెడ్డి పుల్లారెడ్డి దాతల సహకారంతో స్థాపించారు. అప్పట్లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి ద్వారా ఈ పాఠశాలను ఇనగరేషన్ చేశారు. ఈ పాఠశాలలో మనబడి రెండవ దశ ద్వారా రూ.68 లక్షల నిధులు కేటాయింపులతో పనులు జరుగుతున్నాయని మరిన్ని నిధులు వెచ్చించి ఈ పాఠశాలను మండలం లోనే ఒక ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దాలని స్థానిక శాసనసభ్యులు మరియు వ్యవసాయ శాఖ సలహాదారుడు సంయుక్తంగా జిల్లా కలెక్టర్ కు తెలుపడం జరిగింది.
జాయింట్ కలెక్టర్ సాయి కాంత్ వర్మ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాముఖ్యత ఇస్తుందని విద్యార్థులు చదువుకోవడానికి అనువైన సదుపాయాలు కల్పిస్తున్నామని ఈ పాఠశాలను కూడా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి ఒక ఆదర్శ పాఠశాలలు తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పాఠశాలతో పాటు ప్రక్కన అనుకుని ఉన్న ఎస్సీ హాస్టల్ లో కూడా అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ శాఖ సహాయదారుడు ఓ ఎస్ డి వీరారెడ్డి మరియు గోపాల్ రెడ్డి, స్థానిక ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.