గణతంత్ర దినోత్సవం వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రజలు దేశంపై ఉన్న భక్తి, ప్రేమను చాటుకుంటున్నారు. 1950లో భారత దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి నిన్నటికి 73 సంవత్సరాలు పూర్తైంది. ఇవాళ 74వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అందుకే దేశవ్యాప్తంగా 74వ గణతంత్ర దిన ఉత్సవాల్ని జరుపుకుంటున్నాం. మన వాళ్లంతా మన పక్కనే ఉంటే.. డైరెక్టుగా విషెస్ చెప్పొచ్చు. కానీ మన స్నేహితులు, బంధువుల్లో చాలా మంది దూరంగా వేరే ప్రాంతాల్లో, కొందరు విదేశాల్లో ఉంటుంటారు. మరి వాళ్లకు విషెస్ చెప్పేందుకు మనం వాట్సాప్, ఫేస్బుక్, షేర్‌చాట్ వంటివి వాడుతాం. మరి వారికి వైవిధ్యంగా ఎలా విషెస్ చెప్పాలా అని ఆలోచిస్తున్నారా.. అయితే.. మీకోసమే ఇక్కడ విషెస్, మెసేజెస్ రెడీగా ఉన్నాయి. ఓసారి వాటిని చూడండి. మీకు నచ్చినవి పంపేయండి.