మంగళగిరి నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ ఇంచార్జి షైక్ సలీం జాతీయ జండాను ఆవిష్కరించారు. తొలుత జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలే వేని నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గోలి నాగ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్మాలా దుర్గా ప్రసాద్, కార్యదర్శి రేమిడిశెట్టి హనుమంతరావు, మండల ప్రధాన కార్యదర్శి రత్నగోపాల్, మండల కార్యదర్శి మాణిక్యాల కిట్టయ్య, షైక్ సుల్తానా, చిలకా కార్తీక్, కొసనం శివ సాంబశివరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోలి సాంబశివరావు, గోలి మహేష్ బాబు, దామర్ల వీరప్రసాద్, ఇష్టం శెట్టి శివాజీ తదితరులు పాల్గొన్నారు.