74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గురువరాం విశాఖపట్నం పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం పోలీస్ కమీషనర్ సి. హెచ్. శ్రీకాంత్ తో కలిసి పరేడ్ ను వీక్షించి సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు జిల్లాలోని ప్రతీ గడపకు అందుతున్నట్లు పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం సాధిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. త్వరలో జరుగనున్న సదస్సులకు ఏర్పాట్లు చేస్తున్నామని విశాఖపట్నం పరిశుభ్రత, బీచ్ క్లీనింగ్, ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. తదుపరి వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలను తిలకించారు. అదే విధంగా వివిధ పాఠశాలల విద్యార్ధిని విద్యార్ధులతో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించిన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్ధులకు మెమొంటోలను బహుకరించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు, పరేడ్ లో పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాలను అందజేసారు. అనంతరం ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను తిలకించి అర్హులైన లబ్దిదారులకు పరికరాలతో పాటు పి ఎమ్ ఎమ్ ఎస్ వై పధకం క్రింద 18 మంది మత్స్యకారులకు 40శాతం సబ్సిడితో ఐస్ బాక్స్ తో కూడిన ద్విచక్ర వాహనాలను పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో జివియంసి కమిషనర్ పి. రాజాబాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ కె. యస్. విశ్వనాథన్ , డిసిపి సుమిత్ గరుడ్, విఎమ్ఆర్డీఏ చైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల, శాసనమండలి సభ్యులు మాధవ్, వరుదు కళ్యాణి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, ఇతర జిల్లా అధికారులు, అనధికారులు , విద్యార్ధులు పాల్గొన్నారు.