కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి- 40పై శుక్రవారం సాయంత్రం ఓర్వకల్లు కుందూ నది సమీపాన రెండు కార్లు ఢీకొని ఆరుగురికి గాయాలయ్యాయి. హైదరాబాదు నుంచి ఒంటిమిట్టకు శ్రీనివాస్ ఆయన భార్య జ్యోత్స్న కారులో వెళ్తుండగా.. సర్వీసు రోడ్డు వద్ద ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొంది. దీంతో నంద్యాల నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారును ఢీకొట్టింది. జ్యోత్స్న భర్త, డ్రైవర్ శ్రీనివాసులుకు గాయాలయ్యాయి. కారులోనే ఉన్న జ్యోత్స్న ను వైద్య సిబ్బంది 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుప త్రికి తర లించారు. నంద్యాల నుంచి కర్నూలు వెళ్తున్న కారులో టీచర్ సుధాకు మారి, లక్ష్మీకాంతదేవితోపాటు ప్రయాణికురాలు ఈశ్వరమ్మ ఉన్నారు. ఈశ్వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ వెంకటేశ్వర్లుకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో కర్నూలు ప్రభు త్వాసుప త్రికి తరలించారు. రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ముందు భాగం నుజ్జునుజ్జయ్యాయి. సంఘటనా స్థలానికి ఎస్‌ఐ మల్లికా ర్జున చేరుకొని వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్య లు తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.