కృష్ణ జిల్లా,పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌కు చెందిన ఇంటిలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. శుక్రవారం ఉదయాన్నే పనిమనిషి ఇంటి తలుపులు తెరిచి చూడగా వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిఉండటంతో చోరీ జరిగిన విషయాన్ని అనిల్ కుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎమ్మెల్యే తల్లిదండ్రులు 15 రోజుల క్రితం కుమారుల వద్దకు వెళ్లడంతో వారికి సమాచారమందించారు. అనిల్‌కుమార్ సోదరుడు జగదీష్ ఫిర్యాదు మేరకు వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబసభ్యులు ఇంటికొచ్చి పరిశీలించగా 2 కాసుల బంగారం, రూ.10వేల నగదు చోరీ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. క్లూస్ టీం సాయంతో వేలిముద్రలను సేకరించినట్టు తెలిపారు. గన్నవరం డీఎస్పీ విజయపాల్‌చోరీ జరిగిన ఇంటిని, ఘటనా స్థలాన్ని పరిశీలించి జంక్షన్ సీఐ నరసింహమూర్తి, వీరవల్లి ఎస్సై సుబ్రమణ్యం, హనుమాన్‌జంక్షన్ ఎస్సై వెంకటేశ్వరరావుకి సూచనలు చేశారు.