శ్రీకాకుళం కార్పొరేషన్ ఫాజుల్‌బేగ్‌పేటకు చెందిన వార్డు వలంటీరు గొర్లెల కల్యాణి(35) రైలు ఢీకొని గురువారం మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వివరాలను జీఆర్‌పీ పోలీసులు శుక్రవారం తెలిపారు. గొర్రెల కల్యాణిని గురువారం సాయంత్రం శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస)కుద్దిరాం- ఆమదాలవలస మధ్య విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్లే ఇంటర్ సిటీ రైలు ఢీకొంది. ఈ విషయాన్ని రైల్ లోకో పైలెట్ స్థానిక రైల్వేస్టేషన్ మాస్టారు సమాచారం ఇచ్చారు. దీంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని గుర్తించి శ్రీకాకుళం సర్వజని ఆసుపత్రికి తరలించారు. కొద్ది సేపటికి మృతురాలి కుటుంబ సభ్యులు జీఆర్‌పీ స్టేషన్‌కు చేరుకొని పొటో చూపించి ఆనవాళ్లు చెప్పగా మృతి చెందినది గొర్రెల కల్యాణిగా నిర్ధారించారు. మృతురాలు నగరంలో వార్డు వలంటీరుగా పని చేస్తుంది. ఈమెకు భర్త కిషోర్‌కుమార్‌తో పాటు 10 ఏళ్ల కుమారుడు అర్జున్ ఉన్నారు. జీఆర్‌పీ ఎస్‌ఐ షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం మృతదేహం కుటుంబ సభ్యులకు అందజేశారు. కాగా ఈ ఘటన విషయం బయటకు చెప్పకుండా జీఆర్‌ిపీ పోలీసులు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్నేహితుల ఇంటికి వచ్చిన కల్యాణి తిరుగు ప్రయాణంలో ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతి చెందినట్టు పోలీసులు చెపుతున్నా... కుటుంబ కలహాల వలనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు ద్వారా తెలుస్తుంది.