తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌కు వచ్చిన సమాచారం మేరకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు చింతూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.అప్పలనాయుడు పర్యవేక్షణలో మోతు గూడెం ఎస్‌ఐ సత్తిబాబు తన సిబ్బందితో గంజాయిని పట్టుకున్నారు. గొడ్లగూడెం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సుకుమామిడి నుంచి కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు ఐసర్‌వ్యాన్‌లో 20 ప్లాస్టిక్ మూటలతో 500 కేజీలు తరలిస్తుండగా శుక్రవారం పట్టుకున్నారు. దాని విలువ రూ.15లక్షలు ఉంటుంది. కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన సుభాష్, మహారాష్ట్రకు చెందిన సంజయ్ జయదేవ్‌లు కాగా మరో ఇద్దరు ఒడిషాకు చెందిన వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారి వద్దనుంచి 20ప్లాస్టిక్ బ్యాగ్‌లతోఉన్న 500 కేజీల గంజాయి, ఐసర్‌వ్యాన్, రెండు సెల్‌ఫోన్‌లు, ఆధార్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో ఏఎస్‌ఐ పట్టాభిరామయ్య, హెచ్‌సీ రాజేశ్వరరావు, సత్తిబాబు, కానిస్టేబుళ్లు మురళీకృష్ణ, సన్యాసిరావు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.