పర్చూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా పదవి బాధ్యతలు చేపట్టిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తనదైన మార్క్ తో ముందుకు సాగుతున్నారు. ఈనెల 13వ తేదీన అధికారికంగా పార్టీ పగ్గాలు చేపట్టిన ఆమంచి వెనువెంటనే నియోజకవర్గంలోని మండలాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మార్టూరు, ఇంకొల్లులలో పర్యటన పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్ ప్రచార ఆర్భాటం కాకుండా ప్రజా సమస్యల పైనే ఫోకస్ పెడుతున్నారు. తనను కలవడానికి వచ్చేవారు తెచ్చే దండలు, శాలువాలను ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు.
ఆయా గ్రామాల్లో పూర్తిగా ప్రజలతో కలిసి కాలినడకన తిరుగుతూ డ్రైనేజీలు, రోడ్ల అద్వాన్న పరిస్థితిని గమనిస్తూ ఆయన వివరాలు నమోదు చేసుకుంటున్నారు. పంట పొలాలు సందర్శించి రైతుల సాధక బాధకాలు అడుగు తెలుసుకుంటున్నారు. అవసరమైన సందర్భాల్లో అధికారులతో నేరుగా మాట్లాడి వారికి తగు సూచనలు చేస్తున్నారు. అలాగే పార్టీ నేతలు, కార్యకర్తల నివాసాలకు వెళ్లి వారిని ఉల్లాసపరుస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి చేతనైన సాయం చేస్తున్నారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక పూజలలో పాల్గొని మతసామరస్యం ప్రదర్శిస్తున్నారు. మొత్తం గా చూస్తే పరుచూరు నియోజకవర్గంలో ఆమంచి కొత్త ట్రెండ్ సెట్ చేశారనే వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.