కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేని లే అవుట్లో ప్రజలు ప్లాట్లు కొని మోసపోవద్దని కమిషనర్ ఎస్. మనోహర్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ. మహదేవపురం లేఅవుట్ కు ఎటువంటి అనుమతులు లేవన్నారు. మధ్య తరగతి ప్రజల కోసం ఉప్పుచెరువు ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఎంఐజీ లేఅవుట్ అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంఐజి లేఔట్ లో లేదా ప్రభుత్వం అనుమతి ఉన్న లేఔట్ లో ప్లాట్లు ప్రజలు కొనుగోలు చేయాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.