పంగులూరు మండలం జాగర్లమూడి వారి పాలెం వద్ద ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శనివారం సిపిఎం పార్టీ నాయకులు ఆంజనేయులు, తంగిరాల వెంకటేశ్వర్లు లు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు పరిహారం అందజేయాలని ఆంజనేయులు డిమాండ్ చేశారు. అలాగే క్షతగాత్రులకు లక్ష రూపాయలు చొప్పున సహాయం అందించాలని ఆయన కోరారు.