ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లఖీంపూర్ ఖేరీలో పాదచారులను లారీ ఢీకొనడంతో ఐదుగురు మరణించారు. గోలా బెహ్రెచ్ జాతీయ రహదారిపై ఓ స్కూటీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ కారులో ఇరుక్కుపోయింది. రెండు వాహనాలను విడదీసేందుకు పాదచారులు యత్నిస్తుండగా వేగంగా దూసుకొచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. దీంతో ఐదుగురు స్పాట్ లోనే చనిపోగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.