ఉద్యోగుల విరమణ కాలపరిమితిపై తప్పుడు జీవోను సృష్టించి ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తుళ్లూరు డిఎస్పీ పోతురాజు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు ఉద్యోగుల కాల పరిమితి పెంచినట్లు కొందరు ఫేక్ జోవోను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని అదంతా అవాస్తవం అన్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ స్పెషల్ సెక్రెటరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. కొన్ని మీడియా ఛానల్స్ వాస్తవాలు తెలుసుకొని ప్రచారం చేయాలని డిఎస్పీ కోరారు.