నక్కపల్లి మండలం వేంపాడు హైవే టోల్ ప్లాజా వద్ద ఆదివారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. తుని నుంచి విశాఖ వైపు వస్తున్న కారును, వేంపాడు హైవే టోల్ ప్లాజా వద్ద లారీ టర్నింగ్ తిప్పుతుండగా ఆ లారీ కారు డోరును ఢీ కొట్టింది. దీంతో హైవే వద్ద చాలాసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. కారులో ఉన్న వారికి ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎస్ఐ శిరీష ఆధ్వర్యంలో పెట్రోలింగ్ సిబ్బంది ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa