ఇటీవల కేంద్రం తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైలును కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడేలా రైల్వే శాఖ మరో వందే భారత్ రైలును కేటాయించింది. వచ్చే నెలలో సికింద్రాబాద్ నుంచి చెన్నైకి వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్‌లో ఈ రైలు చెన్నై నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు గూడూరు చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరి 5.20 గంటలకు ఒంగోలు చేరుకుంది. 6.25 గంటలకు చేర్యాలకు, 8.25 గంటలకు విజయవాడకు చేరుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa