ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ ను కూడా హాజరుపరచాలంటూ ఎన్ఐఏకు కోర్టు ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 11:49 PM

కోడికత్తి కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకొంది. ఈ కేసులో విచారణకు జగన్ ను కూడా హాజరుపరచాలంటూ ఎన్ఐఏకు కోర్టు ఆదేశాలిచ్చింది. ఇదిలావుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో నాడు జరిగిన దాడి కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. ఈ కేసు విచారణ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో కొనసాగుతోంది. ఈరోజు విచారణ సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణకు జగన్ ను కూడా హాజరుపరచాలని ఎన్ఐఏను ఆదేశించింది. 


ఈ కేసులో తొలి సాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్ పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ రాఘవ విచారణకు హాజరు కాకపోవడంతో కేసుకు సంబంధించి మొత్తం ట్రయల్ షెడ్యూల్ ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఇందులో విక్టిమ్ (బాధితుడు) షెడ్యూల్ కూడా ఉండాలని తెలిపింది. ఈ కేసులో బాధితుడు జగన్ కావడంతో... ఆయన కూడా కోర్టుకు వచ్చేలా షెడ్యూల్ ను రూపొందించాలని ఎన్ఐఏను జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసిన కోర్టు... ఆరోజు విచారణకు జగన్ రావాలని ఆదేశాలు జారీ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com