రైతులకు రూ.20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యవసాయంతో పాటు డెయిరీలు, మత్స్యశాఖను కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు, పీఎం మత్స్య సంపద కోసం అదనంగా రూ. 6 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. అలాగే పంటలు నిల్వ చేసుకునేందుకు గిడ్డంగులు నిర్మిస్తామని తెలిపారు.