కాలవ్యవధి ముగిసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలతో పాటు పాత అంబులెన్సులను తుక్కుగా మారుస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలో కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కేంద్ర మంత్రి కోరారు. పాత వాహనాలను స్క్రాప్ కు ఇస్తే కొత్త వాహనాల కొనుగోలుపై రాయితీ ఇస్తామని ప్రకటించారు.