చిన్నారులు, కౌమార దశకు చేరుకున్న పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయనుంది. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం వెల్లడించారు. వివిధ భాషల్లో నాణ్యమైన పుస్తకాలను అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు భౌతిక గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నేషనల్ చైల్డ్ ట్రస్ట్, చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్, వివిధ స్వచ్ఛంద సంస్థలు సహకారం అందిస్తాయన్నారు.