ఈ బడ్జెట్ లో రైల్వేకు రూ.2.04 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. 2013-2014తో పోలిస్తే రైల్వేకు 9 రెట్లు నిధులు పెంచామని పేర్కొన్నారు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తామని తెలిపారు. రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.13.7 లక్షల కోట్లు, మౌళిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మల తెలిపారు.