ఆదాయపన్ను మినహాయింపు పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ప్రస్తుతం మినహాయింపు పరిమితి 5 లక్షలు ఉండగా దానిని రూ. 7 లక్షలకు పెంచారు. వార్షికాదాయం 9 లక్షల లోపు ఉంటే 5 శాతం, 9 లక్షల నుండి 12 లక్షలు ఉంటే 15 శాతం, 12 లక్షల నుండి 15 లక్షలు ఉంటే 20 శాతం, 15 లక్షలు దాటితే 30 శాతం పన్ను కట్టాలని కేంద్రమంత్రి ప్రకటించారు.