ఎలక్ట్రిక్ వాహనదారులకు హ్యుందాయ్ సంస్థ గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్-విజయవాడ మధ్యలో నార్కెట్‌పల్లె వద్ద, ఢిల్లీ-చండీగఢ్ హైవేపై కురుక్షేత్ర ప్రాంతంలో 2 డీసీ అల్ట్రా-ఫాస్ట్ పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 2023 ప్రథమార్థంలో ఇలాంటి మొత్తం 10 యూనిట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది. క్రమంగా ఈ సంఖ్య పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపింది.
ప్రతి ఛార్జింగ్ స్టేషన్‌లో ఒక యూనిట్ డీసీ 150kW అల్ట్రా-ఫాస్ట్ ఛార్జర్, ఒక యూనిట్ డీసీ 60kW హై-స్పీడ్ ఛార్జర్ ఉన్నాయి. ఇవి ఫిబ్రవరి 1 నుండి ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు అందుబాటులో ఉంటాయి. కంపెనీ ఢిల్లీ-జైపూర్, ముంబై-పూణే, మరియు బెంగళూరు-చెన్నై హైవేలపై మరియు ఢిల్లీ-NCR, ముంబై, చెన్నై, బెంగళూరు మరియు హైదరాబాద్ వంటి నగరాల్లో ఇతర ఛార్జింగ్ స్టేషన్లను ఇన్‌స్టాల్ చేస్తుంది.