కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంటలో 2023-24 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా బంగారం, వెండి, రబ్బరుతో పాటు విదేశాల నుండి దిగుమతి అయ్యే పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని పెంచారు. దీంతో టైర్లు, సిగరెట్లు, బంగారం, వెండి, వజ్రాలు, బ్రాండెడ్ దుస్తులు తదితర వస్తువులపై ధరలు పెరగనున్నాయి.