కదిరి పట్టణంలో దత్త గార్డెన్స్ నందు మండలానికి చెందిన గృహ సారథులకు, సచివాలయ కన్వీనర్లకు, వాలంటీర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు మనం నూతనంగా నియమితులైన గృహ సారథుల, సచివాలయ కన్వీనర్లకు, వాలంటీర్లకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతున్నదన్నారు. ఈ శిక్షణలో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు ఏ విధంగా విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్న అంశాలపై చర్చించుకుందామాన్నారు. వారి ఆదేశాల మేరకు ఈనెల 11వ తేదీ నుండి జె సి ఎస్ మండల ఇంచార్జ్ తో మరియు సచివాలయ కన్వీనర్లు సమన్వయంతో వాలంటీర్ పరిదిలో గల ఇద్దరు గృహ సారథులు వాలంటీర్ తో కలిసి జగనన్న చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా చేరువయ్యాయో తెలుసుకుని, లబ్ధిదారులు జగనన్న చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు సంతృప్తి చెందినట్లయితే ఒక వీడియోను తీసుకొని మండల జెసిఎస్ గ్రూప్ నందు అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, జె సి ఎస్ మండల ఇన్చార్జ్ లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.